ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

బానిసగా బ్రతికినోళ్ళం
బాసిజం తెలియనోళ్ళం
బాసటగా నిలిచినోళ్ళం
బానిసత్వం నుండి ఆదిపత్యం వరకు
పాత్రధారి నుండి సూత్రధారి వరకు 
ఎదిగిన మేము ఒదిగేవుంటాము.
స్వేచ్చకోసం ఆరాటమే కాని
మచ్చలేని మహరాజులం.
తలెగరేస్తూ, కాళ్ళూపుకుంటూ అహంకారం తో మాట్లాడే కుసంస్కారం కాదు మాది
తలెత్తుకు తిరగాలనే ఆత్మాభిమానం మాది .
త్యాగం మాది,అభిమానం మాది.
ఊపిరి నింపిన ఉద్యమం మాది
ఊహకందని మహోద్యమం మాది.
దొరల పాలన వద్దు మాకు ..
సిరులు పొంగే సౌభాగ్య సీమ కావాలి మనకు

 

మీ ఓటు ఎటు ?


చట్టాల్లో మార్పు తీసుకువచ్చేవారికా?
చట్టసభల్లో పోట్లాడుకునే వారికా ?
నీచ రాజకీయలను చేస్తూ కమిటీల పేరిట ప్రజాధనాన్ని,కాలాన్ని వృధా చేసేవారికా?
శ్రుతి తప్పిన రాజకియాల,వాగ్దానాల వెల్లువలో ఉచితాలు,అనుచితాలంటూ,రిజర్వేషన్ల పేరిట  పబ్బం గడుపుకునే వారికా?
భజనలకు, విభజనలకు ముందుండి ప్రజా ప్రతినిధులమంటూ ప్రతీ నిధిని మింగేసే ప్యాకేజీ వీరులకా ?
కుల,మత,ప్రాంత,వర్గ పోరు బాటసారులకా?
యువరాజులకా? రాజాధిరాజులకా ?
మీ కోసం ఏదో చేసేస్తున్నాం! ఇక చూస్కోండంటూ సమయమొస్తేగాని తెలియదంటూ నమ్మబలికే
దుర్మార్గ ,పాపిష్ట ,దుష్ట ,రాక్షస,నీచ నికృష్టులకా ?
సొంత  పత్రికలు,చానళ్ళు పెట్టుకుని తమకు  తామే జాతిపితలుగా,రధ సారధులుగా,దళపతులుగా,మహానేతలుగా చెప్పుకునే సెల్ఫ్ డబ్బగాళ్ళకా?
రంగులేసుకుని,ఊసరవెల్లి లా రంగులు మార్చుతూ అభిమానుల సెంటిమెంట్లను తమ సెటిల్మెంట్లుగా మార్చుకునే వెధవన్నర వెధవలకా?

పత్రికలు ,చానళ్ళు (మీడియా) ఓటుకు లెక్కలు చెబుతున్నా మనకెందుకులేనంటూ ఊరకుండే ఓ మిత్రమా !
ఓటు విషయం లో మందు,డబ్బు,కులం,వర్గం,బంధుమిత్ర ప్రేమలను దూరం పెట్టు. నీ ఒక్క ఓటు తో పరిస్థితి తారుమారు కావొచ్చు.
తప్పుడు నిర్ణయాలతో వ్యవస్థలే కూలిపోవచ్చు .  
ఆలోచించు .... ఆలోచించు.. .ఓ మిత్రమా
వందేమాతరం   వందేమాతరం     .. వందే మా నవతరం

8, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రకంపనం

లేచింది మొదలు మనం చూస్తున్నది స్కాములు , స్కీములు, అక్రమాలు, నేరాలు, ఘోరాలు, లంచగొండితనం, జాతుల జగడాలు, రాజకీయ రాక్షసలీలలు,  కులాల కుమ్ములాటలు మతాలమారణకాండ. సామూహిక అత్యాచారాలు, పరస్పర దాడులు, నకిలి వ్యాపారం , నిత్యవసర వస్తువులలో కల్తీ, అధిక ధరలు, , ఏరులై పారేటి మద్యం. మాదకద్రవ్యాలు, పబ్బుల సంస్కృతి. కుదేలైన ఆర్దికవ్యవస్థ, నియంత్రణ లేని పాలనా వ్యవస్థ.


చూసే చూపు నిప్పై, చెప్పేమాట చేదై, డబ్బే పరమావధిగా మానవత్వం మరచి సంఘాన్ని సమాజాన్ని కూడా లెక్క చేయక అపవిత్రతను ఆపాదించుకుని బ్రతికేవారు కొందరైతే , అసూయా ద్వేషాలను పెంచుకుని ఎదుటి వాడి అభివృద్ధిని చూసి ఓర్వలేనితనంతో మరికొందరు. పాపభీతి కూడా లేదు. ఇతరులను అసభ్య పదజాలంతో దూషించడం, పరిహసించటం తమకు తాము గొప్పలు ప్రకటించుకోవటం, కుల గజ్జి, అహంకారం , విచక్షణారాహిత్యం , డాబు దర్పాలు , సిగ్గుమాలినతనం, సంస్కార హీనత్వం, ఆత్మవంచన, హీనగుణం, అసూయ, ద్వేషం, కుళ్ళు, నీచ వారసత్వం, ఆధిపత్యం, అన్యాయం, అధర్మం, అవినీతి, స్వార్ధం, దుర్మార్గం , శాడిజం, రాక్షసత్వం, వర్గవిభజన. వెన్నుపోటు తనం. వర్గాల విభజన, మనసులలో సంకుచితత్వం, ద్వేషం ఆవేశాలు, ఆగ్రహాలు, దుష్టపన్నాగాలు.

సమాజంలో  మార్పు రావాలంటూ, రాజకీయల్లో మార్పు రావాలంటూ దీనిపై ఉద్యమాలు చేద్దామని అక్రమం జరిగింది, నేరం జరిగింది  ఇది చాలా ఘోరమంటూ మీడియాలో ఆడియోను ప్లే చేసి పదవులకై పాకులాడే సంఘద్రోహులు మన నాయకులు. పేదరికాన్ని, నిరక్షరాశ్యతను, అమాయకత్వాన్ని అసరా చేసుకుని వెనుకబాటుతనాన్ని చూపి ప్రాంతాలను వేరు చేసి నాయకత్వం సాగించాలని చూసె దౌర్భగ్యులు ,దుర్మార్గులు నీతి నిజాయితి మరచి ఉచ్ఛం నీచం మరచి మాట్లాడేది వేదమనే వాదముతో ఏదో దుష్టగ్రహం ఆవహించి, నిగ్రహాన్ని కొల్పోయి పరస్పర ధూషణ. వికృతపు ఆలోచన లను  చేసేవారు మన నాయకులు.

సమాజం మారాలంటూ మనం కుల,మత,వర్ణ, వర్గ, లింగ,జాతి, ప్రాంత భేదాలతో ఒకరినొకరు దూషించుకొంటూ అన్యాయం అధర్మం అంటూ రంకెలేసి మాట్లాడతాము. ఇదిగిదిగో చూడమంటూ రోదిస్తాము. అదేమంటే నిందిస్తాము.

విద్యారంగం లో మాఫియా, వైద్యరంగం లో మాఫియా,రవాణా వ్యవస్థ లో మాఫియా, సినిమారంగం లో మాఫియా  చివరకు  ప్రభుత్వాన్ని సైతం ఈ మాఫియా ఏలుతోంది.

యువత మత్తులో తూగుతూ , అర్దనగ్న నృత్యాలు, ఫ్యాషన్ పేరుతో రోతపుట్టించే వికృత వేషధారణ,  విచ్చలవిడితనం, వీధులలో విద్యార్దిని విద్యార్దుల సైతం వికృత చేష్టలు గోలతో, కేకలతో,ఈలలతో, విచక్షణ మరచి ద్వంద్వార్ధ సంభాషణలను ప్రయోగిస్తూ, శృంగార చేష్టలతో్ ప్రవర్తిస్తున్నా ఏమని ప్రశ్నించలేని పరిస్థితి. రహస్యం లో జీవనం , రహస్యంగా స్నేహం, రహస్యం లోనే మరణం బ్రతుకంతా రహస్యమే. ఆడది ఆడదిగా లేదు. మగవాడు మృగాడైనాడు.

అసలు జరుగుతున్నది ఏమిటి ?
స్వార్ధ  రాజకీయాలతో అసాంఘిక కార్యకలపాలతో, వ్యవస్థలన్ని బ్రస్టుపట్టిపోయి, ప్రజాస్వామ్యమే అపహాస్యమైపోయింది. ప్రజా జీవితం చిన్నాభిన్నమైపోయింది.

మారాలంటారు! అందరిలో మార్పు తీసుకొద్దామంటారు. సమాజాన్ని ఉద్దరిస్తామని ఉపన్యాసలిచ్చే ప్రతీ ఒక్క డికి  ఫొజులకు తక్కువేమి లేదు రాజులను తీసిపోలేరు.
ఎదుటి వాడిపై దుమ్మెత్తి పోయటమే  పని.   

మార్పు ఒకరు తీసుకువచ్చేదేంటి ? మార్పుతీసుకువచ్చే నాయకుడెవరు ? కార్యకర్తలెవరు ? మనమేమిటి ? మన భవిస్యత్తు ఏమిటి ?  రోజు రోజుకి మారుతున్న పరిస్థితులను చూస్తుంటే ప్రపంచం ముందుకు వెళుతుందో లేక నాశనమునకు దగ్గరలో ఉందొ అర్ధంగాని స్థితి!
.'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''  '''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
మన పరిసర ప్రాంతాలను మనం పట్టించుకోము. వీధులలో మూత్ర విసర్జన, బహిరంగప్రదేశాలలో ధూమపానం . నివాస ప్రాంతాలలోని వీధులన్ని గుట్క మరియు పాన్ మసాలను నమిలి ఉమ్మిన ఎర్రటి చారికలతో, ఉమ్ములతో, చెత్తకాగితాలతో, పందులు, కుక్కల సంచారంతోను వాటి మలమూత్రాదులతో మరియు గుంతలతో, ఇండ్లనుండి విడుదలయ్యే మురుగునీటి నిల్వలతో ఉన్నా మనం పట్టించుకోము.

నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి ఈ పంచభూతాలు  కాలుష్యమై పోయాయి.

అడ్డదారిలో అనుమతులు , నాణ్యతలేని కట్టడాలు  ఊహించని ప్రమాదాలు,  గణనకు అందని రాలిన జీవితాలు.  గుంతలుపడిన రహదారులు , ఉప్పొంగి పోయే డ్రైనేజీలు,
పాటించని ట్రాఫిక్ రూల్స్ , సరిలేని వాహనాల నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ, మితిమీరిన వేగంతో వాహన ప్రయాణాలు , నిబంధనలతిక్రమించి వాహనాల సంచారం .
''''''''''''''''''''''''''''''''''''''''''''   ''''''''''''''''''''''''''''''''''''''''''''''''

మీడియాలో మార్పువచ్చింది. జర్నలిజానికి కొత్త రూపొచ్చింది.
వార్తల విషయాలకు వస్తే విషయం చిన్నదైనా, ఎక్కడలేని ప్రాధాన్యతను కల్పించి అనవసరపు రాద్దాంతం, మానసిక హింస, వ్యాపారమే ద్యేయంగా పనిలేనివారితో ఒక పనికిమాలిన విషయం పై చర్చ. భూత,వర్తమాన,భవిష్యత్ కాలాలను ఆపాదించి ఒక చర్చ. అన్నదెవరో | విన్నదెవరో | కన్నదెవరో | చెప్పింది ఎవరో | చెప్పేదిఎవరో | జరిగింది ఏదో| జరుగుతున్నది ఏదో | జరగబోయేది ఏదో| పొంతన లేని, అర్దమేలేని, విషయపరిజ్ఞానమేలేని వారితో చర్చలు.

ఎదుటి వాడికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి

చివరికి మీడియా వ్యవస్థ కూడా జాతి,కులం,మతం,ప్రాంతం,వర్గం,వర్ణం,భాష,సంప్రదాయం అనే దుష్టశక్తులు పట్టిదాని స్వరూపాన్ని మార్చుకుంది.

మేమెవరికి  మొగ్గు చూపమంటూనే ,భజన ప్రసంగాలను చేస్తూ చెప్పిందే చెప్పి మడత పెట్టి చెప్పి ,తిరగబెట్టి చెప్పి, లేని విషయాన్నిఉన్నదిగా, ఉన్నది లేనట్లుగా చూపి ఒకరినొకరు విమర్శిస్తూ ప్రత్యర్ధులను, వ్యక్తులను వ్యంగ్య సంభాషణలతో, వెకిలి చేష్టలతో పరిహశిస్తూ కేవలం వినోద ప్రదానమైనదేనంటూ ఎవరిని కించపరుచలేదంటూ కార్యక్రమాల ముగింపు..
………                        ……………                     …………….              …………

ఖాళీ సమయంలో టివి చూద్దాం అనుకుంటే టివిలో కనిపించే ప్రతి కార్యక్రమంలోనూ (వార్తలు , సీరియల్స్ , సినిమా విశేషాలు వగైరా ...) మనకు కలిగే  స్పందన .. అసహ్యం, చిరాకు, కోపం.

ఏ సీరియల్నిచూసినా ప్రధానంగా ఆడవాళ్లే విలన్లు . నిండు కుటుంబం లో కలకలం సృష్టించే వాళ్ళే సీరియల్స్ లో ముఖ్య పాత్రలు. ఒక పధకం తో ఒక నేరాన్ని , ఒక ఘోరాన్ని ,దుర్మార్గాన్ని ఎన్ని విధాలుగా చేయవచ్చో , తెలియనివాడికి తెలియచెప్పే రీతిలో కధలను వ్రాసి వాటికి వారి శాడిజాన్ని జతపరచి సిగ్గులేనితనంతో వెరైటి అంటూ ఇది వారి స్క్రీన్ప్లే  దర్శకత్వ ప్రతిభ అంటూ డబ్బాలు కొట్టి  చెప్పే నీచ నికృష్ట పరిస్థితి . అన్న చెల్లెళ్ళకు మధ్య నిప్పును రాజేసే భార్య . భార్యాభర్తల మధ్య నిప్పును రాజేసే తల్లి . తల్లి కొడుకుల మధ్య వివాదాన్ని రేపే కోడలు ఇలా రక్తసంబంధాల మధ్య వివాదాలు , సమస్యలు, నిందలు ,ఆరోపణలు . పైగా అంతు దరి లేని విధంగా ఎపిసోడ్లకు ఎపిసోడ్లు . అసలు టైటిల్కు కధకు సంబంధమే ఉండదు . ప్రతి సీరియల్లో హీరో/హీరొయిన్ అమాయకంగానోలేదా అతిమంచిగానో ఉంటారు. చిత్ర హింసలు పెట్టినా వారి లో సహనశక్తి సహజంగా ఉంటుంది.విలన్ లేనివాడైన మధ్యతరగతి వాడైనా పాడుపనులు చేయడానికి లక్షలకు లక్షలు వస్తాయి .మాఫియ వాళ్లతో సంబంధాలుంటాయి . విలన్ నేరాలకు అంతేఉండదు. ఇదే సీరియల్ గమనం .... 4౦౦౦ ఎపిసోడ్లు దాటినా కధ అదే ...... ఇవి నేటి సీరియల్స్.

ఆడియో ఫంక్షన్స్ కొస్తే యాంకర్లు వారి బ్రతుకు దెరువు కోసం తప్పదన్నట్లు లేని పోని హాస్యాన్ని కలబోసి లేని ఆనందాన్ని ప్రదర్శిస్తూ నిర్మాత,దర్శ్లకులను,హీరో అగ్రకధానాయకుడైతే  ఎక్కడలేని పొగడ్తలతో ముంచెత్తి కార్యక్రమాన్ని రక్తి కట్టించడానికి పడే పాట్లు, ఒక వేళ వారసత్వ తారల కార్యక్రమైతే ఆ హీరో,దర్శకుడు,నిర్మాత,మొదలు పెడితే స్టేజ్ ఎక్కిన ప్రతీ ఒక్కడి  ఓవరాక్షను (ఆ హీరో లేనిదే నాకు ఈ రోజు లేదని , కధ, కదనాన్ని గురించి ఏ రచయితలో లేని కోణం ఈ రచయితలోచూసానని ,దర్శకుని మేధాశక్తికి  నా జోహార్లని, పాటలకొస్తే ఏక్సలెంట్ ,మాటల్లేవ్, కేవ్వుకేక , చినిగిపోయిందని,.........అలా...చాలా....) ఇక  మనకు భరించలేని పరిస్థితి. 

ఒక్క సారి ఆలోచించండి.
నా దేశాన్ని చూసి గర్వపడుతున్నాను. నా రాష్ట్రాన్ని చూసి ఆనందపడుతున్నానని  పైపైకి మాటలతో మాట్లాడే వారు వారి  అంతరంగాన్ని పరిశీలిస్తే ఆత్మను కదిలించి దానిని పలకరిస్తే యదార్దం బయటకు వస్తుంది. మనందరిని సిగ్గుపడేలా చేస్తుంది.