ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, నవంబర్ 2011, బుధవారం

ప్రేమ రాగం

చెలియా ! సఖియా !
వీడలేని జ్ఞాపకం
చెలివై సఖివై
తీరిపోని బాంధవ్యం
కన్నీరే సెలయేరై గుండెలోని  బాధా పొంగేను
నీ తలపే మధురం మధురం మధురం
ఆ తలపే వలపై మిగిలిన నీ జ్ఞాపకం
ప్రతీ క్షణం నీ ధ్యానం
ప్రపంచమంతా నీ రూపం
నా ప్రాణం నీకు అంకితం
నీ హ్రుదయానికి నా నీరాజనం
ఈ జీవికి నీవె ఆధారం
నీ మీద నాకు ఉన్న ప్రేమ మరువనిది , మరపురానిది

చెలియా ! సఖియా !
వీడలేని జ్ఞాపకం
చెలివై సఖివై
తీరిపోని బాంధవ్యం

1, నవంబర్ 2011, మంగళవారం

ఓ విద్యార్ది

ఓ విద్యార్ది !
ఎందుకలా గోల చేస్తావు
సంస్కృతి తప్పి ఎందుకలా ఈల వేస్తావు
జ్ఞానము కలిగితె నీవలా చేసి ఉండవేమో
విజ్ఞానము నేర్చిన వివేకము కలుగునని
అక్షరాన్ని అండగ చేసి లక్ష్యాన్ని సాధించగలవని
తెలియక అలా చేసుంటావు
తలిదండ్రుల లాలనలో మహారాజువనిపించి
ప్రజాస్వామ్య పాలనలో బికారిగ జీవించకు
డొంట్ వర్రి అన్నావో
ముందు జీవితము లో ఉండదు ఫ్రీ ...
క్లాసు పీకాననుకుంటే అది లోక్లాసు
విని తరిస్తె అవుతావు హై క్లాసు

మీడియాను చూచి వేయకు ఐడియాలు
కడియాలను తొడిగిన మేధావులే చితికిపోయారు
ఇక నువ్వెంత ?
సంస్కారం వదిలి జీవించకు
నీవు అటెంషన్లో లేకపొతే
జీవితమంతా టెంక్షనే

అమ్మొ ఒకటో తారీఖు

ఓ మధ్య తరగతి కుటుంబికుడా !
చాలీ చాలని జీతపు శ్రామికుడా !
ఫస్ట్ తారీఖు వచ్చింది
గుండె గుభేలుమంది
బడ్జెట్ పెరిగింది

పన్ను భారం పై బడింది

ధరలు పెరిగాయి
అవి కంటివెంట నీళ్ళుగా జారాయి
సంపదన తక్కువై ,భాధ్యతలు ఎక్కువై

శ్రమ ఎక్కువై ,విలువ తక్కువై

అప్పులు
చేయక తప్పుట లేదు
చిమ్మ చీకట్లో చిన్ని దీపం వెలిగించి మహోజ్వలంగా వెలగాలని
కాల ప్రవాహం లో కాగితపు పడవలలో సుదూరం చేరాలనే
నీ ఆరాటం నీ ఇంట నిలువలేదు
నిత్య నీ పోరాటం జరగక ఆగలేదు