ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, అక్టోబర్ 2011, శనివారం

వేదన

ఆలోచించు నేస్తమా!
ఒకపరి ఆలోచించు
హ్రుదయానికి సవ్వడి ఉంటే
మనసుకి తరంగాల ప్రకంపన ఉంటే

లేచింది మొదలు స్కాముల గోలలు
చూసింది మొదలు రాజకీయపు జ్వాలలు
అవినీతిపై బహిరంగ పోరాటాలు
అధికారం కోసం అంతరంగ ఆరాటాలు
తెల్లవాడి పాలనలో మనకు స్వేచ్చ కరువైందనుకుంటే
మనోడి పాలనలో స్వేచ్చ కు అర్ధమే లేదనిపిస్తోంది.

భారత జననీ
నీ ఒడిలో ఇంద్రజాల మహేంద్రజాలకులెందరో కదా !
ఇక్కడ నిత్యము మార్చును వేషము
మనసులనిండా కల్మషము
ఉండును నిలువెల్ల విషము
మగువ ఐనా ఒక్కటే
మగ వెధవయైనా ఒకటే

ఆబగ తినేవాడొకడు
ఆకలితో తినేవాడొకడు
ఆవేదనతో ఒకడు
ఆదేశముతోమరొకడు
అలజడితో ఒకరు
ఆక్రమణలతో మరొకరు

అలసి సొలసి ఒకరు
బాగమేసి బలిసి మరొకరు

దిక్కులేక ఒకరు
ధిక్కరిస్తు మరొకడు
స్థితి లేని వాడొకడు
అసలు మతే లేనివాడు మరొకడు
స్థితి మతి ఉండి దుస్థితిలో ఇంకొకడు
ప్రజా ప్రతినిధులమంటూ
ప్రజల నిధులన్నింటిని దోచే కల్తీగాళ్లు
వెర్రి గొర్రెలందరిని ఒక దగ్గర చేర్చి
చమక్కులు జిమ్మిక్కులు ...
వీటికి సిగ్గుమాలిన వీడియో కవరేజిలు
చుక్క , ముక్క , పక్క తప్ప ఇంకొకటి పట్టని
నీచ అనుచరగణమునకు అధి నాయకుల మనిపించి
మితిమీరిన ధన బలముతో
నేరాలను ప్రొత్సహించి
అదిరించి, బెదిరించి
కుల ప్రస్తావనలతో కులాలకే మచ్చ తెచ్చె
పెంట మీది పుచ్చు పురుగులెందరో కదా!
ఒకప్పుడు చదివినవాడి జ్ఞానం మనకు అక్కర కొచ్చింది
నేటి చదువులలో విజ్ఞానం కరువైంది
చదువు కున్నామా!
చదువును కొన్నామా !
చేసేదేముంది చెంచాగిరి తప్ప !